Phalitamu galadā

rāga: kaḷyāṇavasanta, tāḷa: ādi.

పల్లవి

ఫలితముఁ గలదా మీ యాజ్ఞప్తి వినా ఓ జగదంబా

అనుపల్లవి

తల్లి మీ దయ లేక యేమి చేయవలెను సన్మార్గముఁ జూడవమ్మ నాకు

చరణం

చిత్తశుద్ధిలేక ప్రొద్దు వేగలేచి మనసులో ననృతముఁ గల్గితే కర్మఁ జేసి పుణ్యం బేమి వచ్చును

మాఱుబల్కుమా యీ వేఙ్కటప్రణవును బ్రొవుమా మాయమ్మ లోకజనని

pallavi

phalitamu galadā mī yājñapti vinā o jagadambā

anupallavi

talli mī daya leka yemi ceyavalĕnu sanmārgamu jūḍavamma nāku

caraṇam

cittaśuddhileka prŏddu vegaleci manasulo nanr̥tamu galgite karma jesi puṇyam bemi vaccunu

māṟubalkumā yī veṅkaṭapraṇavunu brovumā māyamma lokajanani

Contact me here, view the source repository here, or view romanization conventions here.